ఉపాధి హామీతో పేదలకు మేలు

వరంగల్: ఉపాధి హామీ పథకంతో పేదలకు మేలు కలుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన పల్లి గ్రామ శివారులో చెరువు పూడిక తీస్తోన్న కూలీలను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. కూలీలు, అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు పని కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ పనికి వ్యవసాయ పనులను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

అమిత్ షాకు క్రీడల శాఖ బాగుంటది

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు