యాసంగిపై స్పష్టత వచ్చాకే ధాన్యం కొంటం

యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాసంగిపై స్పష్టత వచ్చిన తర్వాతే ధాన్యం కొంటామన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఎలాంటి వైఖరి వెల్లడించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఎదురుచూస్తున్నారన్నారు. పీఎం మోడీ స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారని.. అలాగే కరెంట్ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలన్నారు.  బీజేపీ చట్టాల వలన  రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బీజేపీ నాయకులు చాలా మంది రైతులు కాదని...రైతుల సమస్యలు వారికి తెలియవన్నారు. చట్టాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.  రేవంత్ రెడ్డి పక్కీర్ మాటలు బంద్ చేసి.. చేతనైతే ఢిల్లీలో లో పోరాటం చేయాలన్నారు. రేవంత్  ఛత్తీస్ ఘడ్ వెళ్లి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలుపై అడగాలన్నారు.