మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి : ఎర్రబెల్లి దయాకర్​రావు

తొర్రూరు, వెలుగు : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా  ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు బాగుపడితేనే దేశం, రాష్ట్రం, బాగుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

బుధవారం తొర్రూరులో సర్టిఫికేట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళల కోసం పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా రూ.5 కోట్ల 10 లక్షలతో కుట్టు శిక్షణ ప్రారంభించి, కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 

మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా..  మొదటి విడతగా 3వేల మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో   ట్రస్ట్​ చైర్మన్​ ఉషాదయాకర్​రావు, కే.నరసింహ రెడ్డి, గౌతమ్ జైన్​, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్​, మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య, పీఏసీఎస్​ చైర్మన్​ హరిప్రసాద్​రావు, డాక్టర్​ సోమేశ్వర్​రావు, వివిధ గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.