ఎంజీఎంలో మరణాలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం

వరంగల్ ఎంజీఎంలో మరణాలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీరియస్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. ఎంజీఎంలో డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎంజీఎంకు రావాలని సూచించారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ఎంజీఎంలో అన్నీ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.

వరంగల్ ఎంజీఎంలో నిన్న ఒక్కరోజే 20 మంది పేషెంట్లు చనిపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 8 మంది చనిపోగా..ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చివరి దశలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ 12 మంది చనిపోయారు. తెలిసీ తెలియక హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ సీరియస్ అయ్యాక ఎంజీఎంకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డాక్టర్ల సలహాలు తీసుకోకపోవడంతోనే మరణాలు సంఖ్య పెరుగుతున్నాయని చెబుతున్నారు.