రాయపర్తి, వెలుగు : కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌ను ఆదరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
also read : పార్టీ మారటం లేదు.. నామినేషన్ నేనే వేస్తున్నా : అద్దంకి దయాకర్
తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు డప్పుచప్పుళ్లు, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయపర్తిలో ఓ మహిళ మంత్రికి అన్నం తినిపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి గుడిపూడి గోపాల్‌రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మునావత్ నరసింహనాయక్ పాల్గొన్నారు.