తెలంగాణాలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం : ఎర్రబెల్లి దయాకర్​రావు

తొర్రూరు, వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మోటర్​ డ్రైవింగ్​ స్కూల్​ ఆధ్వర్యంలో శనివారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. కొందరు సర్వేల పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు.

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. అనంతరం నాయకులు  తూనం శ్రావణ్, మణిరాజ్​ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్​, పీఏసీఎస్​ చైర్మన్​ హరిప్రసాద్​రావు తదితరులు పాల్గొన్నారు.