చెత్త సేకరణలో అలసత్వం వద్దు

వరంగల్: ప్రజలు తమ గ్రామాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాయపర్తి మండలం కాట్రాపల్లి గ్రామం లో నిర్వహించిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో  కలెక్టర్ గోపితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ...  వైకుంఠధామాల్లో అన్ని వసతులు ఉండేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు. నర్సరీలు, వైకుంఠ ధామాల చుట్టూ పూల మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడా పడేయవద్దని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలోనే వేయాలని ఎర్రబెల్లి సూచించారు. ట్రాక్టర్ పోలేని విధుల్లోకి  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డంప్ యార్డ్ లో పోగు అయ్యే చెత్త, ప్లాస్టిక్ ను  అమ్మితే గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తోందన్న మంత్రి...  ఎరువుల తయారీకి  తడి, పొడి చెత్త ఉపయోగపడుతుందని తెలిపారు. చెత్త సేకరణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.