యాదాద్రీశుడి సేవలో మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 2023 ఆగస్టు 22న  యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు.  మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

సీఎం కేసీఆర్ తనకు మరోసారి పాలకుర్తి టికెట్ కేటాయించడంపై  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేయాలని,  కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు ఎర్రబెల్లి. గతంలో గెలిచిన దానికంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.