ఎర్రబెల్లి కాన్వాయ్ ను అడ్డుకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్

వరంగల్ లోని  హన్మకొండ ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర  మంత్రి ఎర్రబెల్లి దయాకరరావ్ కాన్వాయిని అడ్డుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్స్. సీఎం టూర్ పై ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ వెళ్తుండగా గెస్ట్ హౌస్ ముందు మంత్రిని అడ్డుకుని ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన కారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. వరంగల్ లో నిర్మించబోయే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు . ఈ నెల 21న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారంతా భూములు ఆక్రమించుకున్న వారేనన్నారు. ఆస్పత్రులు కడితే బీజేపీ నేతలను నష్టం ఏంటన్నారు. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించిందని అన్నారు. వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం ఫెయిలైందన్నారు ఎర్రబెల్లి దయాకర్.