
పర్వతగిరి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో సోమవారం పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నాయకులు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నామని, ప్రతి మండలానికి ఒక అభివృద్ధి కమిటీని నియమిస్తామన్నారు. అనంతరం రాయపర్తి మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా బిల్లా సుధీర్‌రెడ్డిని నియమించారు.