జనగామ: తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే సమావేశానికి వస్తున్న సందర్భంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తలపై మంత్రి ఎర్రబెల్లి సరదాగా కొట్టారు. ముందుకు చూస్తూ నడవాలని హెచ్చరించారు.
For More News..