వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి లోని విఘ్నేశ్వరుని మండపంలో వినాయకునికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరుని మండపం వద్ద మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… మన ఆచార సంప్రదాయాలు ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సర్వమత హితం మన సమాజ హితం అని గుర్తు చేసుకున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి కాబట్టే మనల్ని ప్రపంచం లో గొప్ప వారిగా గౌరవిస్తారన్నారు. సర్వమతాల సమ్మేళనమే మన భారత దేశం.. అన్ని మతాల వాళ్లు కలిసి చేసుకునే పండుగలు మన భారతదేశంలో తప్ప ఎక్కడ లేవన్నారు. వినాయక చవితి పండుగ సర్వ మత సమ్మేళనానికి నిలయం అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ఈ పండుగను ప్రభుత్వ నిబంధనల మేరకు మన పరిమితి మేరకు జరుపుకుంటున్నాం.. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.