మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వర్ధన్నపేట, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ తర్వాత రాజకీయాల్లో తానే సీనియర్‌నని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్రూరల్జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపెల్లిలో ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులతో కలిసి శుక్రవారం డంపింగ్ యార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లు గాంధీ పేరు వాడుకున్నోళ్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎద్దేశా చేశారు. కేంద్రం ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచన చేస్తున్నారన్నారు. స్వచ్ఛత, ఉపాధిహామీలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
For More News..