జై భారత్.. జై శ్రీరాంతో పాటు జై కేసీఆర్​ అనాలె

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

జై భారత్.. జై శ్రీరాం అంటే తమకూ ఇష్టమేనని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘‘జై భారత్.. జై శ్రీరాం.. జై అల్లా.. జై ప్రభువు అందాం. అట్లనే
జై తెలంగాణ అనాలె.. జై కేసీఆర్ అనాలె.. కానీ వాళ్లు జై తెలంగాణ అనరు.. గుజరాత్.. ఉత్తరప్రదేశ్ అంటరు.. దీన్ని బట్టే మనం అర్థం జేసుకోవాలె’’ అంటూ బీజేపీని ఉద్దేశించి ఆయన కామెంట్ ​చేశారు.

వర్ధన్నపేట, వెలుగు: జై భారత్.. జై శ్రీరాం అంటే తమకూ ఇష్టమేనని.. వాటి పేరుతో బీజేపోళ్లు ఎట్ల చేస్తున్నరో ప్రజలంతా గమనించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జై భారత్.. జై శ్రీరాం.. జై అల్లా.. జై ప్రభువు అందాం. అట్లనే జై తెలంగాణ అనాలె.. జై కేసీఆర్ అనాలె.. కానీ వాళ్లు జై తెలంగాణ అనరు.. గుజరాత్.. ఉత్తరప్రదేశ్ అంటరు.. దీన్ని బట్టే మనం అర్థం జేసుకోవాలే అంటూ బీజేపీని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో గురువారం నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్​, సతీష్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు ప్రచారంలో బీజేపోళ్లు నం. 1 అని దుయ్యబట్టారు. బండి సంజయ్ మాటలు నాక్కూడా వినబుద్దైతదని..ఎందుకంటే అవి రికార్డింగ్ డ్యాన్స్ లాగా ఉంటయని అన్నారు. కేసీఆర్ హీరో అంటూ కామెంట్ చేశారు. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యమంటే.. డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ ఇస్తున్నరని ఎద్దేవా చేశారు. గిరిజన యూనివర్సిటీకి స్థలం కేటాయించి నాలుగేళ్లవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. తెలంగాణకు  కేంద్రం ఒక్కరూపాయికూడా ఇస్తలేదని ఆరోపించారు. తెలంగాణలో 1.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ఎవరైనా ఉద్యోగాలు ఇయ్యలేదని నిరూపిస్తే ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. ఒకరేమో ప్రశ్నించే గొంతుక అంటారు. ఇంకొకరు ఉద్యోగాల విషయంలో సర్కారును బద్నాం చేసేలా మాట్లాడతారు. అన్నీ తెలిసిన ప్రొఫెసర్లు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని.. తాను మాత్రం ప్రశ్నించే గొంతుక కాదు.. పరిష్కారం చూపే గొంతునవుతానని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

For More News..

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

గతేడాది ట్రాపిక్ ఫైన్లు రూ. 613 కోట్లు.. హెల్మెట్ కేసులే ఎక్కువ

త్వరలో నిరుద్యోగ భృతి.. రేపోమాపో కేసీఆర్​ అనౌన్స్​మెంట్