వరంగల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎంకు కృతజ్ఞతలు

వరంగల్: సీఎం కేసీఆర్ ఏ జిల్లాకు ఇవ్వని ప్రాధాన్యత వరంగల్ కు ఇచ్చారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. వరంగల్ కు వరాలు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన..వరంగల్ జిల్లాకు సాగునీరు విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. వరంగల్ కు కాళేశ్వరం, దేవాదుల నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. వరంగల్ కు మెడికల్ హబ్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అని ..ఎంజీఎం సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి రూ.1575 కోట్లు అంచనా వేశారని తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల జనాభా సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని..బీజేపీ చెత్తపార్టీ, కేంద్ర ప్రభుత్వం చెత్త ప్రభుత్వం విభజన హామీలను విస్మరించారన్నారు. సీఎం పర్యటనను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేశారని..కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు.