- మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి, వెలుగు: విద్యార్థులు కష్టపడి చదివితేనే తమ గమ్యానికి చేరుతారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కేజీబీవీ జూనియర్ కళాశాల నూతన భవనానికి రూ.3.25 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా 1029 గురుకులాలు ఉన్నాయని, 3 వేల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. కస్తూర్బా, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ లలో 40 శాతం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెరిగాయన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదవాలన్నారు. కస్తూర్బాలో 360 మంది విద్యార్థులు చదువుతున్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయనే ఫిర్యాదు ఉందని, అధికారులు వెంటనే స్పందించి, నీళ్లు నిలువకుండా చూడాలన్నారు. టీపీసీసీ మెంబర్ బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షుడు సుకినె సంతాజీ, నాయకులు గొడిశాల యాదగిరి గౌడ్, రాజేశ్వరరావు, గొర్రె మహేందర్, అంబాల శ్రీకాంత్ తదితరులు
పాల్గొన్నారు.