- మాజీ మంత్రి గడ్డం వినోద్
- కాంగ్రెస్‌లోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
బెల్లంపల్లి రూరల్/బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి నియోజకవర్గాన్ని తమ్ముడు గడ్డం వివేక్ వెంకటస్వామి, తాను కలిసి ప్రగతిపథంలో నడిపిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్అన్నారు. నెన్నెల మండల కేంద్రంలో గురువారం బహిరంగ సభలో ఆయనమాట్లాడారు. మా తండ్రి వెంకటస్వామి ఆశయాల మేరకు తమ్ముడు వివేక్, తాను కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
9 ఏండ్ల పాలనలో ఎమ్మెల్యే చిన్నయ్య చేసిందేమీ లేదన్నారు. బెల్లంపల్లిలోనే తన కూతురితో ఉండి సొంత ఇల్లు నిర్మించుకొని, ప్రజల బాగోగులు చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీశ్‌గౌడ్, నెన్నెల, కుశ్నపల్లి సర్పంచ్‌లు తోట సుజాత, సంధ్య, ఆవుడం యువనాయకుడు కిషన్‌రెడ్డి, వార్డు సభ్యులు, మైలారం ఉపసర్పంచ్‌తో పాటు కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని వివిధ పార్టీలకు చెందిన 2500 మంది కాంగ్రెస్‌లో చేరారు.
నాయకులు తోట శ్రీను, మహేశ్‌రెడ్డి, సాంబమూర్తిగౌడ్, చెన్నోజి శంకరయ్య, మోహిద్‌ఖాన్, రాజన్న యాదవ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని రంగపేటలోనూ వినోద్ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన 100 మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.