- అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్న మంత్రి గంగుల
కరీంనగర్ టౌన్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగలను జిల్లా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శనివారం 44వ డివిజన్ లో నిర్వహించిన దుర్గామాత అమ్మవారి పల్లకీ సేవలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు.
పూలను దేవతగా కొలిచే సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అందరినీ సుఖ సంతోషాలతో చల్లంగ చూడాలని దుర్గామాతను ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు పలువురు మైనార్టీ నాయకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్ శ్రీలత, లీడర్లు చంద్రశేఖర్, మహిపాల్, అతీఫ్ హుస్సేన్, వాజిద్, అమ్జద్, అయాజ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.