కరీంనగర్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్ డిజిటల్ ప్రచార రథంపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీశ్వర చారి చెప్పుతో దాడి చేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ ఈడీ రథంపై నగరంలోని దుర్శేడ్ లో తిరుగుతోంది.
అయితే ఈ క్రమంలో జగదీశ్వర చారి ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.