రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది : గంగుల కమలాకర్

బీఆర్ఎస్ను ఓడించేందుకు బండి సంజయ్ , రేవంత్ రెడ్డి, షర్మిల ఏకమయ్యారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.  తెలంగాణాను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. మన పిల్లల భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. జనం ఆదరణ పొందేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని మంత్రి గంగుల చెప్పుకోచ్చారు. తన చివరి రక్తం బొట్టు వరకు  కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని మంత్రి వెల్లడించారు. ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా తనకు కలిగినట్టేనని అన్నారు. పార్టీని కార్యకర్తలు కాపాడితే..కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని మంత్రి గంగుల తెలిపారు.