కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణలో సాగు, తాగు నీటి సమస్య తీరిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లిలో నిర్వహించిన చెరువు పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయతో మండుటెండల్లో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయని అన్నారు. మన బొగ్గుతో 24 గంటల నాణ్యమైన కరెంట్ వెలుగులతో రాష్ట్రం వెలిగిపోతోందని గంగుల చెప్పారు. సమైక్య పాలనలో గోదావరి పక్కనే ఉన్న సాగు నీటి కోసం తెలంగాణ తండ్లాడిందన్నారు.
భావితరాల భవిష్యత్ ఇలాగే ఉండాలంటే, అభివృద్ది కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసపు మాటలతో మళ్ళీ ముందుకు వస్తున్నాయని విమర్శి్ంచారు. వారిని నమ్మితే తెలంగాణ గుడ్డి దీపం అవుతుందన్నారు.
రాష్ట్రంలో మలవుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు మంత్రి గంగుల కమలాకర్ . దేశ ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలు కావాలని కోరుకొంటున్నారని చెప్పారు. ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలనే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఊరూరా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.