ఢిల్లీ పాలకుల చేతిలోకి తెలంగాణ పోతే 50 ఏళ్లు వెనక్కిపోతదని మంత్రి గంగుల కమాలాకర్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్లీ ఢిల్లీ పాలకుల చేతిలో పెట్టే్ందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కరీంనగర్ లో వీ6తో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు ఆరు వేల గ్యారంటీలు ఇచ్చిన ప్రజలు నమ్మరని చెప్పారు. కర్ణాటకలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలే అమలు కావట్లేదని విమర్శించారు. పొన్నం ప్రభాకర్ సేఫ్ ప్లేస్ అని హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్లిపోయి ఉంటడాని ఆరోపించారు. కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఓట్లు పడవనే భయంతోనే హుస్నాబాద్ కు వెళ్లిపోయి ఉంటాడన్నారు.
ALSO READ : V6 దెబ్బకు దిగొచ్చిన సర్కార్ ఆఘమేఘాలపై రోడ్డుకు మరమ్మతులు
ఇక తాను 2023 అక్టోబర్ 18 నుంచి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని మంత్రి గంగుల కమాలాకర్ చెప్పారు. చేసిన అభివృద్ధి చూపించే ఓట్లు ఆడుగుతామని చెప్పారు. హైదరాబాద్ తరువాత కరీంనగర్ రెండో నగరంగా రూపాంతరం చెందిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు 24/7 నీళ్లు అందించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి.. యువతకు ఉపాధి కల్పి్స్తామని తెలిపారు. కాంగ్రెస్ ముసుగులో కేవీపీ, షర్మిల, బీజేపీ ముసుగులో కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నరని, సీమాంధ్ర నేతలపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.