సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసం సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా రొటీన్ కు భిన్నంగా సరదాగా గడిపారు. సంస్ధాన్ నారాయణపురం మండలంలో ప్రచారం చేస్తున్న సమయంలో కార్యకర్తలతో కలసి పటాకులు కాల్చారు. 18,000 వాలాలు కాల్చి ముచ్చట తీర్చుకున్నారు.
మంత్రి గంగుల పటాకులు కాలుస్తుంటే.. కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. వామపక్షాల నాయకులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి గంగుల కాల్చిన 18,000 వాలా పటాకులు ఆకాశంలోకి దూసుకెళ్తుంటే.. కార్యకర్తలు చప్పట్లు, కేరింతలు కొడుతూ ఉత్సాహ పరిచారు. దీపావళి పండుగ సందర్భంగా రొటీన్ కు భిన్నంగా ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించడంతో నాయకులతోపాటు కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల పటాకులు కాల్చడాన్ని స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో తీసుకుని సన్నిహితులకు షేర్ చేశారు.