కరీంనగర్ పట్టణ వాసులకు మంత్రి గంగుల కమలాకర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రజలు అడిగిన కోరికలను వెంటనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మా ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరైనా అడిగితే తక్షణమే రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలు అడిగిన వెంటనే రోడ్డు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 25 కోట్ల నిధులను బంఫర్ కింద పెట్టుకున్నామని చెప్పారు. మరో రూ. 125 కోట్లతో కరీంనగర్ నగరంలోని మిగిలిపోయిన మెయిన్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు గంగుల తెలిపారు.
2023 ఆగస్టు 15వ తేదీన మంగళవారం సాయంత్రం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తీగల వంతెనపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కు రాష్ట్ర, జాతీయ స్థాయి కళాకారులు హాజరవుతారని మంత్రి గంగుల వెల్లడించారు.