సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించి కలెక్టరేట్లో అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్లో అధునాతన హంగులతో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ పనులను మంత్రి గంగుల పరిశీలించారు. కేసీఆర్ పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని గంగుల కమలాకర్ చెప్పారు. ఈ రివ్యూలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్ రావు, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ పాల్గొన్నారు.
రేపు ఉదయం జగిత్యాలలో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు వెళ్లనున్నారు. రేపు రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో కేసీఆర్ బస చేయనున్నారు. ఎల్లుండి వి-కన్వెన్షన్‌లో జరిగే మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి సీఎం హాజరుకానున్నారు. తర్వాత కొత్త గెస్ట్ హౌస్‌ను సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.