మట్టి రోడ్డు లేని సిటీగా కరీంనగర్ : గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్,వెలుగు : మట్టిరోడ్లు లేని సిటీగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సిటీలోని 1,2,4,5,6,11,27 డివిజన్లలో రూ.133కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎస్‌‌‌‌డబ్ల్యూజీ పైపులైన్ నిర్మాణ పనులకు  ఆదివారం రాత్రి మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీ అభివృద్ధికి అవసరమైతే మరో రూ.500కోట్లు తీసుకొస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు మాలతి, నర్మద, లీడర్లు సంపత్ రెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.

యాదవుల అభివృద్ధికి కాల్వ నర్సయ్య కృషి 

కరీంనగర్​ రూరల్ ​: యాదవుల అభివృద్ధికి కాల్వ నర్సయ్యయాదవ్ కృషి చేశాడని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత కాల్వ నర్సయ్య యాదవ్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బొమ్మకల్‌‌‌‌లో యాదవ సంఘానికి గతంలోనే స్థలంతోపాటు  రూ.15 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. రూ.20 కోట్లతో సిటీలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు.