మత సామరస్యానికి ప్రతీకగా కరీంనగర్ : మంత్రి గంగుల

కరీంనగర్ టౌన్, వెలుగు: మత సామరస్యానికి కరీంనగర్ ప్రతీకగా  నిలిచిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  మిలాద్‌‌‌‌ ఉన్‌‌‌‌ నబీ సందర్భంగా శుక్రవారం స్థానిక  రాజీవ్‌‌‌‌ చౌక్‌‌‌‌లోని అస్లామ్‌‌‌‌  మసీద్‌‌‌‌ వద్ద  నిర్వహించిన  ర్యాలీలో  మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమతాల పండుగులను  సంతోషంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.  అనంతరం  ముస్లిం మత పెద్దలు శాలువాతో మంత్రిని సన్మానించి, ఆశీర్వదించారు. కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ మాజీ డిప్యూటీమేయర్ అబ్బాస్ షమి, కోఆప్షన్ మెంబర్ అమ్జద్, పవన్ కుమార్ పాల్గొన్నారు.

బీసీలకు ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ పాలసీ అమలు చేయాలి

గోదావరిఖని :  సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది కార్మికులు, అధికారుల్లో 25 వేల మంది బీసీలు ఉన్నారని, వారికి ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ పాలసీ పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి బీసీ ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో  మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ను కలిసి కోరారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.