పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మే 28వ తేదీ ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. పదేండ్ల జిల్లా ప్రగతిని చాటుతూ దశాబ్ది ఉత్సవాలు జరుపాలని సూచించారాయన. ప్రతీ శాఖ పదేండ్ల ప్రగతి నివేదిక అభివృద్ధి పథకాలపై ప్లెక్సీలు ప్రదర్శించాలన్నారు. సక్సెస్ స్టోరీలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని తెలిపారు గంగుల.
అన్ని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని..ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి గంగుల.
ఈ సమావేశానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు హాజరైయ్యారు.