యాసంగిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి: మంత్రి గంగుల

యాసంగిలో  చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.. నీరు  అవసరం ఉన్నచోట ఓటిలను ఏర్పాటు చేసి నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మానకొండూర్, చొప్పదండి , హుస్నాబాద్ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు చెప్పారు. అసంపూర్తిగా ఉన్న కెనాల్, ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి చెరువులు, కుంటలు నింపాలని తెలిపారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిచే గుత్తేదారులపై కఠనంగా వ్యవహరించాలని గంగుల ఆదేశించారు. ఈ  రివ్యూ జరుగుతుండగానే మంత్రి తండ్రి గంగుల మల్లయ్య మరణవార్త  తెలియడంతో ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారు. 

రాష్ట్రంలో ఆయిల్ కు మంచి డిమాండ్ ఉంది

రాష్ట్రంలో ఆయిల్ కు మంచి డిమాండ్ ఉన్నందున  అయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గంగుల కమలాకర్  అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో  ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగుల ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 95 వేల కోట్ల రూపాయల ఆయిల్ ను మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి చెప్పారు.  ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే మనమే సాగుచేసుకుంటే మంచిదన్నారు. వరిపంట కన్నా... 60-, 70 శాతం లాభం ఆయిల్ ఫామ్ లో వస్తుందని గంగుల  తెలిపారు. ఈ పంటపై అవగాహన పెంచుకోవాలని రైతులకు మంత్రి సూచించారు.