ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత 

కరీంనగర్ టౌన్: ఉద్యమంలో పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని మినిస్టర్ గంగుల కమలాకర్ అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభ్​ భాయ్ పటేల్ కృషితో హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసిపోయిందన్నారు. కుమ్రం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, బద్దం ఎల్లారెడ్డి, కాళోజీ త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవిశంకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కరీంనగర్ లోని నగరపాలక సంస్థలో సమైక్యత వజ్రోత్సవ వేడుక నిర్వహించారు.  మేయర్ సునీల్ రావు,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి,  కమిషనర్ సేవా ఇస్లావత్ జెండా ఆవిష్కరించారు.  అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీస్​లో కలెక్టర్ జి రవి, ఎస్పీ ఆఫీస్ లో ఎస్పీ సింధు శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

పెద్దపల్లి: ప్రజలంతా ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో వినోద్​కుమార్ జెండా ఎగురవేసి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సంగీత, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు. 

చొప్పదండి​: సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా చొప్పదండి, రామడుగు, కరీంనగర్ మండలాల్లోని అన్ని ప్రభుత్వ ఆఫీస్​లు, జీపీలు, స్కూళ్లు,ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలు ఎగురవేశారు. కరీంనగర్​ మండలం నగునూరులో, రామడుగు మండల కేంద్రంలో బీజేపీ లీడర్లు తెలగాణ విమోచన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాలు ఎగురవేశారు. 

కోల్‌‌బెల్ట్‌‌లో..

గోదావరిఖని: రామగుండంలోని వివిధ ప్రాంతాల్లో సమైక్యత దినోత్సవం జరిపారు. రామగుండం క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌, పోలీస్ హెడ్‌‌ క్వార్టర్స్‌‌లో సీపీ చంద్రశేఖర్‌‌ రెడ్డి, సింగరేణి ఆర్జీ 1 జీఎం ఆఫీస్‌‌లో జీఎం కె.నారాయణ, ఆర్జీ 2 జీఎం ఆఫీస్‌‌లో జీఎం ఎ.మనోహర్‌‌, రామగుండం మసీద్‌‌ టర్నింగ్‌‌లో బీజేపీ కార్పొరేటర్‌‌ కౌశిక లత, గోదావరిఖనిలో కాంగ్రెస్‌‌ ప్రెసిడెంట్‌‌ బొంతల రాజేశ్‌‌, టీబీజీకేఎస్‌‌ ఆఫీస్‌‌లో జనరల్‌‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, వన్‌‌ ఇంక్లైన్‌‌లో వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ మల్లయ్య, బీఎంఎస్‌‌ ఆఫీస్‌‌లో ప్రెసిడెంట్‌‌ సత్తయ్య, ఐఎన్‌‌టీయూసీ ఆఫీస్‌‌లో సెక్రెటరీ జనరల్‌‌ బి.జనక్‌‌ ప్రసాద్‌‌ జాతీయ జండాలు ఎగురవేశారు.

జాతీయ సమైక్యత చాటేందుకే..

మెట్ పల్లి: తెలంగాణలో జాతీయ సమైక్యత చాటేందుకే సర్కారు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని సివిల్ హాస్పిటల్, టీఆర్ఎస్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. స్థానిక నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో టీచర్లు, స్టూడెంట్లు పిరమిడ్, చతురస్రాకారంలో నిలబడి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించారు. 
కోనరావుపేట: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుక కోనరావుపేట మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ ఆఫీస్​లో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.

జాతీయ సమైక్యత చాటేందుకే..

మెట్ పల్లి: తెలంగాణలో జాతీయ సమైక్యత చాటేందుకే సర్కారు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని సివిల్ హాస్పిటల్, టీఆర్ఎస్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. స్థానిక నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్ లో టీచర్లు, స్టూడెంట్లు పిరమిడ్, చతురస్రాకారంలో నిలబడి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించారు. 


జమ్మికుంట : సమైక్యత వజ్రోత్సవాలను జమ్మికుంటలో ఘనంగా జరిపారు. మున్సిపల్ ఆఫీస్​లో చైర్మన్ రాజేశ్వర్ రావు, తహసీల్దార్ ఆఫీస్​లో తహసీల్దర్ రాజేశ్వరి, మండల పరిషత్ ఆఫీస్​లోఎంపీపీ మమత, పోలీస్ స్టేషన్ లో సీఐ రామచందర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు.

కోరుట్ల/కథలాపూర్: సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక క్యాంపు ఆఫీస్​లో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, మున్సిపల్ ఆఫీస్​లో చైర్​పర్సన్​ లావణ్య జాతీయ జెండాలు ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ చిరుమల్ల ధనుంజయ్, యువ నాయకుడు సురభి నవీన్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు జెండా ఎగరవేశారు.  

వాడవాడలా ‘విమోచన’ వేడుక

జమ్మికుంట, వెలుగు : ఉమ్మడి కరీంనగర్​జల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జమ్మికుంట పట్టణ శాఖ శాఖ అధ్యక్షుడు మల్లేశ్ ఆధ్వర్యంలో మోత్కుల గూడెం చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ ప్రజలంతా త్యాగధనుల సేవలను స్మరించుకోవాలన్నారు. అనంతరం ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు రాజ్ కుమార్, రవి,  స్వరూప, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

సుల్తానాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ లీడర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం ముందు చైర్ పర్సన్ ముత్యం సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

వేములవాడ: పట్టణంలోని ప్రతీ పోలింగ్ బూత్ లో బూత్ అధ్యక్షుడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. వేములవాడ బీజేపీ ఆఫీస్​లో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, ఎర్రం మహేశ్, పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్: బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో కార్యాలయ సిబ్బంది, బీజేపీ లీడర్లు, స్థానికులు  జెండా ఎగురవేశారు. అలాగే యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ  జన్మదిన వేడుకలు నిర్వహించారు.

రోడ్డు ఊడుస్తూ, చెప్పులు కుడుతూ కాంగ్రెస్ ​నిరసన

కోరుట్ల,వెలుగు: ప్రధాని మోడీ పుట్టిన రోజు సండర్భంగా కోరుట్ల లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హోటల్ లో చాయ్ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడారు. మోడీ పుట్టిన రోజును నిరుద్యోగ దినంగా జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు అంజిరెడ్డి, రిజ్వాన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.   

ఎల్లారెడ్డిపేట: మోడీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు ఉడుస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాజునాయక్, నాగరాజు, రవి, శ్రీకాంత్ రెడ్డి, చిన్ని బాబు పాల్గొన్నారు.

జమ్మికుంట: పట్టణంలోని గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​నేతలు చెప్పులు కుట్టి నిరసన వ్యక్తం చేశారు.  యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సజ్జద్ మొహమ్మద్ మాట్లాడుతూ గుజరాత్ మోడల్ అని చెప్పిన ప్రధాని అధికారంలోకి వచ్చాక దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేశ్, అయ్యూబ్,  శ్రీకాంత్, ఫయాజ్, అబ్రర్, ప్రణీత్, శ్రీకాంత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్‍ ఫంగస్‍ను సమర్థంగా ఎదుర్కొన్నాం
వైస్‍ చాన్సలర్‍ కరుణాకర్‍రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: కొవిడ్‍ సమయంలో బ్లాక్‍ ఫంగస్‍ రోగులకు ఈఎన్‍టీ డాక్టర్లు సమర్థవంతమైన సేవలు అందించారని వరంగల్‍ కేఎన్‍ఆర్​యూహెచ్‍ఎస్‍ వైస్‍ చాన్సలర్ డాక్టర్‍ బి. కరుణాకర్‍రెడ్డి అన్నారు. చెవి, ముక్కు, గొంతు డాక్టర్స్ అసోసియోషన్‍ ఆఫ్‍ ఇండియా ఆధ్వర్యంలో నగునూర్‍లో   ప్రతిమ మెడికల్‍ కాలేజీలో శనివారం  నిర్వహించిన రాష్ట్ర ఈఎన్‍టీ డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఈఎన్‍టీ వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్‍ హానర్‍ డాక్టర్‍ ఎంబీ. భారతి, డాక్టర్‍ సతీశ్​జైన్‍, స్పెషల్‍ గెస్టులుగా ప్రతిమ మెడికల్‍ కాలేజీ డీన్‍ డాక్టర్‍ అచంట వివేకానంద, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్‍ కమిటీ చైర్మన్‍ డాక్టర్‍ రమణాచారి, సెక్రెటరీ డాక్టర్‍ సాయిప్రసాద్‍రావు తదితరులు పాల్గొన్నారు. 

అల్ఫోర్స్ స్టూడెంట్ కు ఇన్ స్పైర్ అవార్డు

కరీంనగర్ టౌన్, వెలుగు: నేషనల్ లెవల్ ఇన్ స్పైర్ అవార్డుకు అల్ఫోర్స్ స్టూడెంట్ ఎంపికైనట్లు చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వావిలాలపల్లిలోని సెంట్రల్ ఆఫీస్ లో ఇన్ స్పైర్ అవార్డు పొందిన 9వ తరగతి స్టూడెంట్ పూజశ్రీని చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ఇన్ స్పైర్ మనాక్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా పూజశ్రీ రూపొందించిన యాక్సిల్ వీల్ కెమెరా నమూనా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పారు. కేంద్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా సన్మానం పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 

‘వేతనాలు పెరిగేదాకా కొట్లాడుదాం’

గోదావరిఖని, వెలుగు : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెరిగేదాకా కొట్లాడుదామని వివిధ రాజకీయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు వారు మద్దతు తెలుపుతూ శనివారం గోదావరిఖని మెయిన్‌‌ చౌరస్తాలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ స్టేట్‌‌ లీడర్‌‌ కౌశిక హరి, ఏఐటీయూసీ జనరల్‌‌ సెక్రెటరీ వి.సీతారామయ్య తదితరులు మాట్లాడారు. తొమ్మిది రోజులుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేస్తున్నప్పటికీ మేనేజ్‌‌మెంట్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు  సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ రాజారెడ్డి, హెచ్‌‌ఎంఎస్‌‌ జనరల్‌‌ సెక్రెటరీ రియాజ్‌‌ అహ్మద్‌‌, బీఎంఎస్‌‌ స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ సత్తయ్య, ఇప్టూ లీడర్‌‌ ఎ.వెంకన్న, జడ్పీటీసీ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

జగిత్యాల, వెలుగు: రాయికల్ పట్టణ, పరిసర గ్రామాల్లో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడంతో శనివారం ఇద్దరు చిన్నారులు చనిపోయారు. రాయికల్ కు చెందిన రాయనవేని శృతి(12)కి నాలుగు రోజుల నుంచి జ్వరం తగ్గకపోవడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శృతికి డెంగీగా నిర్ధారించారు. అప్పటికే శృతి పరిస్థితి  విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో బాలికను హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు నరేశ్,​-సరిత తెలిపారు. అలాగే మండలంలోని రామోజీపేటకు చెందిన కంటే జాన్విత(5)కు జ్వరం రావడంతో  హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందిన జాన్విత ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.