కరీంనగర్: బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, ఘాట్ ల వద్ద గజ ఈతగాళ్లను పెట్టినట్లు మంత్ర గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం జిల్లాలోని గైతమి నగర్ లోయర్ డ్యాం వద్ద నిర్మించిన నిమజ్జన ఘాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిందన్నారు. ఒక్క కరీంనగర్ లోనే మొత్తం రూ.2 కోట్లతో 20 చోట్ల బతుకమ్మ నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బతుకమ్మ ఘాట్ కోసం రూ.5 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. బతుకమ్మ ఘాట్ల వద్ద విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
రాష్ట్రంలోని ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. ఆయన వెంట నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ఉన్నారు.