ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం

కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష డ్రామా దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్‌‌‌‌లో కరోనా కేసులు పెరిగితే సంజయ్‌‌నే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కరోనా రూల్స్‌‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాత్రి మీడియాతో గంగుల మాట్లాడారు. తమకు రాజకీయం ముఖ్యం కాదని, కరీంనగర్ జిల్లా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పారు. జాగరణ దీక్షకు ఒక్క పర్మిషన్ అయినా ఉన్నదా అని ప్రశ్నించారు. 

సంజయ్ చుట్టూ వందల మంది మాస్కులు లేకుండా ఎందుకు పాల్గొన్నారన్నారు. దీక్షను అడ్డుకున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. బండి సంజయ్‌‌కి జీవో నంబర్ 317పై ఏం అవగాహన ఉందని ప్రశ్నించారు. జీవో విషయంలో ప్రభుత్వానికి లెటర్ రాశారా, టీచర్ సంఘాలతో మంతనాలు జరిపారా అని నిలదీశారు. ప్రజల్లో సానుభూతి కోసమే దీక్షకు దిగారని అన్నారు. మోడీ ఇంటి ముందు కోటి ఉద్యోగాలపై దీక్ష చేయాలని అన్నారు.