అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మిక సిటీ కరీంనగర్ : గంగుల కమలాకర్

 కరీంనగర్, వెలుగు : అభివృద్ధి, ఆహ్లాదం, ఆధ్యాత్మికం సిటీగా కరీంనగర్​మారిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదేళ్లలో కరీంనగర్‌‌‌‌ను రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. మరోవైపు టీటీడీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ నిర్మాణాలతో ఆధ్యాత్మిక సిటీగా మారనుందన్నారు. శుక్రవారం మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి సిటీలో పలు చోట్ల సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించడంతోపాటు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు.

కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్,  కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, నక్క పద్మ కృష్ణ, కుర్ర తిరుపతి, ఆర్ష కిరణ్మయి, మల్లేశం పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌‌లో సీఎం బ్రేక్‌‌ఫాస్ట్​ పథకాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు.