పొన్నం ప్రభాకర్ ఔట్ డేటెడ్ లీడర్: గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఔట్ డేటెడ్ లీడర్‌‌‌‌ ‌‌‌‌అని, ప్రజలు ఆయన్ను ఎప్పుడో మర్చిపోయారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ బలహీన పడటానికి పొన్నం ప్రభాకరే కారణమని, గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదన్నారు. పొన్నం డివిజన్‌‌‌‌లోనే బీజేపీ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మంగళవారం కరీంనగర్ లైబ్రరీలో మీడియాతో గంగుల మాట్లాడారు. పొద్దంతా తెలంగాణపై విషం చిమ్మే ఈ నాయకులు.. రాత్రయితే కలిసి మాట్లాడుకుంటారని ఆరోపించారు.

గత ఐదేండ్లలో 4 ఏండ్ల 9 నెలల పాటు కనిపించకుండా పోయిన ఈ నాయకులు.. ఎన్నికల టైమ్‌‌‌‌లో బయటికి వస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం కొట్లాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ తనకు బాల్య స్నేహితుడేనని, తమకు రాజకీయ విభేదాలు తప్ప.. వేరే ఏమి లేవన్నారు. 

సంజయ్‌‌‌‌ నన్ను జైలుకు పంపాలనుకున్నడు...

తన వ్యాపారాలపై ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదులు చేసి, తనను జైలుకు పంపించేందుకు కుట్రలు పన్నాడని, కానీ  విచారణలో అవన్నీ ఫాల్స్ అని తేలిపోయిందని గంగుల గుర్తుచేశారు. పొన్నం ప్రభాకర్, సంజయ్ ఇద్దరు కలిసి తనపై కోర్టుకు వెళ్లారని, వారిద్దరు ఒకటే అనడానికి ఇదే ఆధారమన్నారు. తాను ఎవరి జోలికి పోనని, తన జోలికి వస్తే వదలనని హెచ్చరించారు. ఎన్నికలు రాగానే దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అనే అంశం తెరపైకి వచ్చిందన్నారు. తమది ఢిల్లీ పార్టీ కాదని,  తెలంగాణ పార్టీ అని చెప్పారు.


బీసీలకు ఆర్థిక సాయం గడువును పెంచేది లేదుబీసీలకు ఆర్థిక సాయానికి సంబంధించి గడువును పెంచేది లేదని గంగుల స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇప్పుడు అప్లై చేసుకోని వాళ్లకు మళ్లీ రెండో దశలో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రతి నెల15న లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.