ఎల్లుండి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం

  • ఎల్లుండి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం
  • గన్నీ బ్యాగుల కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నాం

హైదరాబాద్: ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ చివరి వరకు మొత్తం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. వడ్ల కొనుగోలుకు రైతులు సహకరించాలన్న గంగుల.. వేరే రాష్ట్రంలో పండిన పంటను మన దగ్గర అమ్మకుండా జాగ్రత్త పడాలన్నారు. కేంద్రం సహకరించకున్నా వడ్లు కొంటున్నామని.. రైతులకు నష్టం కలగకుండా MSPకి కొంటామన్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రానికి నోడల్ ఆఫీసర్ ఉంటారని..15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమన్నారు. ప్రస్తుతం  గన్నీ బ్యాగుల కోసం జ్యూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తున్నామన్నారు.   రైతులు, అధికారులు, మిల్లర్లు, హమాలీలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సమన్వయం, పరస్పర సహకారంతో పని చేయాలని, రూ.1960 మద్దతు ధరతో గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తామన్నారు. ప్రతి రైతుకు టోకెన్లు ఇచ్చి.. క్రమపద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. గోదాములు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ భవనాలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు.