విధ్వంసానికి దారితీసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు

బండి సంజయ్ లాంటి వ్యక్తుల వల్లే గతంలో మతఘర్షణలు జరిగాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కొరుకోరు..అభివృద్ధిని మాత్రమే కోరుకుంటారన్నారు. కరీంనగర్ లో బీరప్ప కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కరీంనగర్ లో ఎక్కడ చూసిన అభివృద్ధే కనిపిస్తుందని..ఎన్నిక ఏదైనా ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతున్నారని చెప్పారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక శాంతిభద్రతల సమస్య తలెత్తలేదన్నారు.

బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ది కోసం గడ్డపారతో తవ్వాలి కానీ విధ్వంసం కోసం కాదని హితవుపలికారు. హిందూ ఏక్తా ర్యాలీలో బండి సంజయ్ వ్యాఖ్యలు విధ్వంసానికి దారితీసేలా ఉన్నాయన్నారు.మీలాంటి మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల వల్లే గుజరాత్ లో అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రపంచంలో ఏ కంపెనీ గుజరాత్ వైపు చూడడం లేదని చెప్పారు. బండి సంజయ్ కు సత్తా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయాలని సవాల్ చేశారు.

మా దృష్టి అభివృద్ధి మీద.. మీ దృష్టి మతఘర్షణల మీద అని గంగుల విమర్శించారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే.. మీరు మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. ఒక మతాన్ని మరో మతం గౌరవించుకోవడం తెలంగాణ సంప్రదాయమన్న మంత్రి..బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధమైన ఎంపీ పదవిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
 

మరిన్ని వార్తల కోసం

మోడీజీ..కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది?

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక