- రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : తెలంగాణ ఉద్యమ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బాపూజీ 108వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్కు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం ఆయన విగ్రహానికి కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బి. గోపి, నగర మేయర్ వై. సునీల్ రావు, కరీంనగర్ ఆర్డీఓ కె. మహేశ్వర్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు పాల్గొన్నారు.
అలాగే స్థానిక నగరపాలక సంస్థ లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి, బైపాస్ రోడ్డులోని బాపూజీ విగ్రహానికి మేయర్ సునీల్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, మంథనిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు.