లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ .. కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో మార్చి12న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
ALSO READ :- రూ.7వేలకే స్మార్ట్ ఫోన్.. అద్బుతమైన బ్యాటరీ,కెమెరా ఫీచర్లు
దాదాపుగా లక్ష మంది హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. సభకు హాజరయ్యేందుకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ స్థలాలు, సభ ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించినట్లుగా గంగుల వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లను ఎంపిక చేశారు. బహిరంగ సభలో మరోమారు వీరి పేర్లను కేసీఆర్ ప్రకటిస్తారు.