50 వేల మెజార్టీతో గంగుల గెలుస్తడు: చల్ల హరిశంకర్

కరీంనగర్ టౌన్,వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లపై ఎంపీ బండి సంజయ్  ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్  హెచ్చరించారు. మంగళవారం రామ్ నగర్ లోని మీకోసం ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. .కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ 50వేలకు  పైగా మెజార్టీతో గెలుస్తడన్నారు. అతని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

ఎంపీగా గెలిచి  ఏ మేరకు  అభివృద్ధ చేశావో చెప్పి ఎన్నికలకు  వెళ్లాలని బండికి సవాల్ విసిరారు.  సిటీలోని 13మంది కార్పొరేటర్లు ప్రస్తుతం  సంజయ్ తో పనిచేసేందుకు సిద్ధంగా లేరన్నారు.  సమావేశంలో  ప్రశాంత్  రెడ్డి, రాజు, చందు, షౌకత్, శ్రీనివాస్  రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.