మంత్రి గంగుల పిటిషన్.. సర్కారుకు నోటీసులు

  • భూ వివాదం కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తాను కొన్న భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చడాన్ని సవాలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ వేసిన రిట్ పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరీంనగర్‌‌‌‌ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌‌‌‌లోని 126వ సర్వే నంబర్‌‌‌‌లోని 15.26 ఎకరాలను వక్ఫ్ భూములుగా పేర్కొంటూ గతంలో కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ 2014లోనే గంగుల రిట్‌‌‌‌ పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌‌‌‌ యాక్టులోని 22ఏ సెక్షన్‌‌‌‌ కింద నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ కరీంనగర్‌‌‌‌ జిల్లా కలెక్టర్‌‌‌‌ 2020 మే 8న ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌ను కూడా సవాల్‌‌‌‌ చేస్తూ తాజాగా మరో రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌‌‌‌ పి.నవీన్‌‌‌‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. విచారణను మార్చి 23కి వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి 

కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్​కు..

కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ‌‌‌‌

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు