పోలీసుల కోసం హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ : హరీశ్ రావు

పోలీసుల కోసం హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ : హరీశ్ రావు

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల కోసం హెల్త్ ప్రొఫైల్ క్యాంప్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమంను  ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. సిద్దిపేట జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో  పోలీసులకు 55 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఈ ఆరోగ్య రక్ష కార్యక్రమం రెండు సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. అవసరం ఐతే మల్లీ కొన్ని రోజులు పొడిగిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని పోలీసులు స్టేషన్ లకు సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని హరీశ్ అన్నారు.  అన్ని సంఘాలు ఎదో పని కోసం దరఖాస్తులు ఇస్తారు కానీ పోలీసుల సంగం ఎలాంటి దరఖాస్తులు ఇవ్వదన్నారు. ప్రజల కోసం కుటుంబాలను, పండుగలను సైతం వదులుకొని పోలీసులు పని చేస్తారని చెప్పారు.