- బీజేపీ అంటే కాపీ... పేస్ట్ పార్టీ
- భవన్లో కూర్చొని మాట్లాడితే సమస్యలు తెలియవు: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. ఎక్కడో ఢిల్లీలో లేదా హైదరాబాద్ గాంధీ భవన్ లో కూర్చొని మాటలు మాట్లాడే నాయకులకు తెలంగాణలో నీళ్లు వస్తున్నాయా ? లేదా ? అనే విషయం ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటే కాపీ, పేస్ట్ పార్టీ.. తెలంగాణ పథకాలను చూసి వాళ్లు కాపీ కొడుతూ నేర్చుకుంటున్నరు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ’’ అని హరీశ్ రావు విమర్శించారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు 50 మంది యువకులు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, నేతలపై మండిపడ్డారు.