- ఇప్పటికే ఇరుకైన బిల్డింగ్ లో 180 బెడ్లు
- వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే మెడికల్ క్లాసులు
కామారెడ్డి , వెలుగు :కామారెడ్డిలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మెడికల్ కాలేజీ క్లాసులు ప్రారంభిస్తామని ఇటీవల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దానికన్నముందు ఐఎంసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. 350 బెడ్లు ఉంటేనే కాలేజీకి ఐఎంసీ అనుమతి దక్కుతుంది. ప్రస్తుతం కాలేజీ ఏర్పట్లన్నీ జిల్లా ఆస్పత్రిలోనే కొనసాగుతున్నాయి. కానీ, ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 180 బెడ్లు ఉన్నాయి. గతంలో వంద బెడ్లు ఉండగా.. పెరిగిన రోగుల కారణంగా ఇటీవలే మరో డెబ్బై ఇరుకైన గదుల్లో నే సర్దుబాటు చేశారు. అదనంగా కాలేజీ అనుమతి కోసం 170 బెడ్లు పెంచడానికి స్థలం దొరుకక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఖాళీ స్థలంలో, బిల్డింగ్ పై ఫ్లోర్లో రేకుల షెడ్లు వేసి బెడ్లు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అయినా స్థలం సరిపోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కొత్త బిల్డింగ్ కోసం నిధులు..
కాలేజీ బిల్డింగ్ కోసం రూ. 234 కోట్ల ఫండ్స్, 433 పోస్టులు కూడా శాంక్షన్ చేశారు. 28 మంది రెసిడెన్సియల్ డాక్టర్లను కేటాయించారు. కొత్త బిల్డింగ్ కోసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వెనుక స్థలాన్ని సెలక్ట్ చేశారు. ఈ స్థలం ఇంకా అధికారికంగా అప్రూవల్ కావాల్సి ఉంది. ఆ త్వరలోనే అక్కడ సీఎం కేసీఆర్ కొత్త బిల్డింగ్‌కు భూమి పూజ చేస్తారని ఎమ్మెల్యే గంప గోవర్దన్ ప్రకటించారు.
ఏరియా ఆస్పత్రి నుంచి మెడికల్ కాలేజీ దాకా..
ఏరియా హస్పిటల్ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా హస్పిటల్గా మారింది. స్థాయి మారింది కానీ, స్టాఫ్ సంఖ్య, వసతులు మాత్రం మారలేదు. 100 బెడ్లకు సరిపడా సౌకర్యాలు ఉన్న ఈ ఆస్పత్రిలో 180 బెడ్స్ ఉన్నాయి. ఎంసీఐ టీమ్ వచ్చే సరికి పూర్తి బెడ్లు సిద్ధంగా ఉండాలి. బెడ్లతో పెంపుతో పాటు, ఇతర మౌళిక వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్ల కోసం హెల్త్ డిపార్ట్మెంట్, టీఎంఐడీసీ ఆఫీసర్లతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చర్చించారు. బెడ్స్ పెంచేందుకు గతంలో పై అంతస్థులో షెడ్డు నిర్మించారు. మరోప్లేస్లో రేకులు వేశారు. అవినిండితే మిగిలిన ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. పనులకు కావాల్సిన ఫండ్స్‌కు ఎస్టిమేషన్ ఇవ్వాలని కలెక్టర్ ఆఫీసర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో పనులకు ఫండ్స్ వచ్చినా.. బెడ్లకు స్థలం కేటాయించడం కష్టంగానే మారనుందని అధికారులు అంటున్నారు.