
కంది, వెలుగు : సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను గెలిపిస్తే సంగారెడ్డికి మెట్రో రైలు తెస్తానని, మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుబాటులో ఉండని లీడర్‌ను గెలిపించినా లాభం ఉండదని ఆయన అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి గౌడ, మైనార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గౌడ కులస్థులకు సంవత్సరానికి చెట్ల ట్యాక్స్ రూ. 20 కోట్లు మాఫీ చేశామన్నారు. లైసెన్సులను 10 సంవత్సరాలు ఒకేసారి రెన్యూవల్ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గౌడ్‌లకు లూనాలు అందిస్తామన్నారు. సిద్దిపేటలో మాదిరిగా సంగారెడ్డిలో గౌడ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీతా కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, నాగరాజుగౌడ్, సాయికుమార్‌గౌడ్, ప్రభుగౌడ్, కృష్ణాగౌడ్, ఆశన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ ఆత్మీయ సమేళనంలో ...
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక మైనార్టీల అభివృధ్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. షాదీముబారక్, మైనార్టీ బంధు, మైనార్టీ రెసిడెన్షియల్హస్టళ్లు, కాలేజీలు, ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడానికి స్కాలర్షిప్లు తదితర పథకాలు చేపట్టామని హరీశ్ రావు తెలిపారు. గురువారం సదాశివపేట పట్టణంలో చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో భారీగా కార్యకర్తలు,నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ఈ రోడ్‌షో ఎంపీడీవో ఆఫీసు నుంచి బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంలోకి పోతుందని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు వారంటీ లేనివన్నారు. మళ్లీ ఓట్లు అడుగుతున్న జగ్గారెడ్డి ప్రజలకు ఏం చేశారో నిలదీయాలన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, స్రవంతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read :- న్యుమోనియా కేసులపై మరింత సమాచారం ఇవ్వండి .. చైనాను కోరిన డబ్ల్యూహెచ్‌వో