
- 17 న సిద్దిపేటలో లక్ష మందితో ఆశీర్వాద సభ
- మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేటలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 17 న సిద్దిపేట లో లక్ష మందితో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారని సభను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలకాలని అందుకోసం మండలాల వారీగా జన సమీకరణకు సమాయత్తం కావాలని సూచించారు.
గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో దేశ స్ధాయి లో సిద్దిపేట గౌరవాన్ని పెంచారని ఆదిశగా మరోసారి సిద్దిపేట ప్రతిష్టను పెంచాలని తెలిపారు. సిద్దిపేట ప్రజలే తన కుటుంబ సభ్యులని వారి అభివృద్ధి కి నిరంతరం పాటుపడుతానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాధాకృష్ణ శర్మ, రాజనర్స్, రవీందర్ రెడ్డి, చిన్నా, పాల సాయి రాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.