
గజ్వేల్, వెలుగు: నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వర్గల్ మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు భారీ మెజార్టీ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అనంతగిరిపల్లి పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల నర్సింలు, ఉప సర్పంచ్ కనకరాజుయాదవ్, నాయకులు కిషన్, ఆగేశ్, రవి, నగేశ్, దారజాని ఉన్నారు.