కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో పంచి గెలిచేందుకు ప్రయత్నిస్తు్ందని ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు.
కర్ణాటకలో గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ వసూలు చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 50 శాతం వసూలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో టికెట్‌లు అమ్ముకొంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎవరూ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి బీఆర్ఎస్ వంద స్థానాలు ఉంటాయన్నారు. కేసీఆరే మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.