అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఐటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుంటే కేంద్రం ఎలా అవార్డులు ఇస్తు్ందని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతమైన పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పారు.
60 ఏళ్లుగా జరగని అభివృద్ది కేసీఆర్ ఒక్కరే చేసి చూపించారని హరీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు లక్ష50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న హరీష్.. ప్రైవేటు రంగంలో 17 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసే అబద్దాపు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. నల్గొండ జిల్లాలో 13 స్థానాల్లో గూలాబీ జెండానే ఎగురుతుందని, కాంగ్రెస్ కు 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థలు లేరని హరీష్ విమర్శించారు.