కాంగ్రెస్ కు చాన్సిస్తే పెద్దపాము మింగినట్టే : మంత్రి హరీశ్​రావు

కాంగ్రెస్ కు చాన్సిస్తే పెద్దపాము మింగినట్టే : మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట: పొరపాటున కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే అని మంత్రి హరీశ్ రావు​అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో  స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్​కు చాన్సిస్తే పెద్దపాము మింగినట్టే. కేసీఆర్ మాట అంటే తప్పడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటడు. బీజేపీ గ్యాస్ ధరను అడ్డగోలుగా పెంచింది. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నం. ఏ పథకం అయినా మహిళ పేరిట పెడితే సద్వినియోగం అవుతుంది. క్షణికావేశంలో మహిళలు ప్రాణప్రాయ నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా, సఖి సెంటర్ లు ఏర్పాటు చేశాం. గతంలో ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ పనులకు కైకిలోళ్లు దొరుక్తలేరనే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం చేరింది’ అని హరీశ్​రావు తెలిపారు.

 సెల్ఫ్ బీపీ చెకప్ మిషన్ ప్రారంభం

అంతకుముందు సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ లో సెల్ఫ్ బీపీ చెక్ మిషన్ ను మంత్రి  ప్రారంభించారు. ఆరోగ్యం కాపాడుకుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు.  ప్రజల హెల్త్​కాపాడాలనే ఉద్దేశంతోనే బీపీ చెకప్​మిషన్​ఏర్పాటుచేశామని మంత్రి పేర్కొన్నారు.