బీఆర్ఎస్ బలపడుతుందనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ఏ పార్టీకి ఏంజెట్ కాదని రైతులకు మాత్రమే ఏంజెట్ అని చెప్పుకొచ్చారు.
ఆదానీ బలపడాలంటే బీజేపీకి ఓటు వేసి మోడీని గెలిపించాలన్నారు హరీష్ రావు. ఇక ఎవరెన్ని సభలు పెట్టిన గెలిచేది బీఆర్ఎస్ అని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా అవేమి కేసీఆర్ ముందు చెల్లవని చెప్పారు. తాము బహిష్కరించిన నేతలే వేరే పార్టీలు చూసుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు.
మరోవైపు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై అప్రమత్తంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. మలేరియా, డెంగీ వ్యాధులు తగ్గాయని చెప్పిన ఆయన.. మలేరియాను గుర్తించేందుకు 8లక్షల రాపిడ్ కిట్స్ అందుబాటు లో ఉంచామని వెల్లడించారు . లక్ష 23వేల డెంగీ కిట్ లను అందుబాటు లో ఉంచామని తెలిపారు.
ప్లేట్ లెట్లు ఎక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఎక్కడ కూడా నీటి గుంతలు లేకుండా చూడాలని వైద్యశాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.